స్త్రీ బుద్ధి ప్రళయాంతకహ అన్నారు పెద్దలు....వీడేమిటిరా ఇలా మొదలెట్టాడు అనుకుంటున్నరేమో...నేను కూడా ఇంత కాలం 'యత్ర నార్యంతు పూజ్యంతే తత్ర రవంతి దెవతా' అనుకున్న వాడినే......మరిప్పుడెమైంది అంటారా…ఎమొ..ఎందుకొ గడచిన కొన్ని రొజులుగా ఇదె అనిపిస్తొంది…అంత బాధ పడుటూ వాళ్ళ గురించి ఎందుకులేండి…మగ మహరజులం మనం ఉన్నాం కదా…ఎమంటారు?…
సరే ఇక నేను, నాలో చెప్పుగొదగ్గ గొప్ప విషయలేమి లేవు..ఏదొ సాద సీద మనిషిని….పేరు వంశీ కృష్ణ కార్తీకు….ఉండేది భాగ్యనగరంలొ(అభాగ్యమేమో) చేసేది సోఫ్త్ వేరు ఈంజినీర్ అనే కొత్త పేరు పెట్టిన టైపిస్టు ఉద్యొగం….ఇంకా సహధర్మ చారిని రాలేదు..బహుశా అందుకెనెమో మొదటి పేర లొ అలా రాసాను…అయ్యుంటే నన్నీపాటికి చంపేయదూ :) ..
భగవంతుడు అనే వాడున్నాడని నమ్మే వాడిని నేను..అయన నాకిచ్చిన అతి పెద్ద వరం…మా అమ్మ, నాన్నగారు…మళ్ళీ జన్మంటు ఉంటే వీరికె పుట్టాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నను..అదే విధంగా వేరే జన్మ ఉండగూదదని కుడా కొరుకుంటున్నను…
ఏదొ అంటారు..సృష్తిలొ తీయమైనది స్నేహమేనొయి అని….ఏమో నాకైతే తీపి కన్న చేదు అనుభవాలే ఎక్కువ ఉన్నాయ్….బహుసా అది నాలొనే ఎదైన లొపం అయుందచ్చు…ఆది తెలియాలంటే నా స్నెహితులు నాతొ ఆ ముక్క చెప్పేస్తె మారటానికి నాకు ఆస్కారం ఉంతుంది…మర్పు కావలండొయ్…
ఇకపొతె నా అభిరుచులు…రుచిగా ఉండె పదార్థాలన్ని తినటం నా అభిరుచి…నా గొంతు బండగా ఉండేది(ఇంక ఉందండొయ్)..అందుకని చిన్నప్పుడు నాకు సంగీతం నెర్పాలంటే మా మష్తారు భయపడిపొయారు… సంగీతం ఐతే రాలేదు కానీ ఆ భగవంతుడి కృపా కటాక్ష వీక్షణం వల్ల…కీర్తనలను పాడగలుగుతున్న(ఇప్పటికీ గాన గార్ధబన్నే లేండి)…
ఫ్రస్తుతానికైతే వొంటరిని…ఎప్పటికైనా వొంటరినె లేండి..కాకపొతే ఎదో ఎవరో వస్తారనే చిన్న ఆశ....
ఇంత సేపు నా సొల్లు ఎవరూ చదివి ఉండరు...చదివిన వాళ్ళకి కృతగ్నతలు....
ఇట్లు విధేయుడు
వంశీ కృష్ణ కార్తీకు