Monday, April 16, 2007

Pelli..avasarama.

అసలూ నెనన్నాననీ కాదు కానీండి, పెళ్ళి పెళ్ళి అని మన పెద్దవాళ్ళు వెంట పడుతూ ఉంటారు కదాఅసలు మనకి పెళ్ళి అవసరమంటారాగురువర్యులు శ్రీ అన్నమాచార్యుల వారు అన్నత్తొ

వివిధ నిర్బంధముల వెడలదోయక నన్ను
భవసాగరముల దడబడ చేతువ….

అసలే పాపులందానికితోడు ఇంకొ పాపి తొ కలిసి కొత్త పాపాలు చేసేందుకు సంసారం అనే ఇంకో నరకం లోకి వెల్లిపొతున్నం….

మరి ఇవన్నీ అనవసరం లేదు అనే అనుకుందాం..

ఆత్మావై పుత్ర నామాసి….అని కూడా మన పెద్దలే అన్నారుఅంటే పిండం పెట్టడానికి ఒక కొడుకు ఉండాలంటారుపెళ్ళి కాకుండా పిల్లలు ఎక్కడి నించి వస్తారు(ఇంక చాలు ఆలొచనలు ఆపండి)

పొనీ పెళ్ళి వద్దు అనుకుందామా….అగస్త్యుడంతటి వారే..వారి పితృదేవతలకి ఉత్తమగతులు కలగాలని పెళ్ళి చేసుకుని..పుత్రుని కన్నారు కదా..మనమెంత

అలా అని..బ్రహ్మచారులుగా ఉండి బొలెడంట ఘ్నానన్ని సంపాదించిన, తాతగారు నారదుల వారు లెరావారితొ మనకి పొలికేమిటి లేండి.. అంత మాత్రనికి పెళ్ళి చెసుకొవాలని లేదుఅసలు పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి ఎవరో ఒకరు మనల్ని ఎదో ఒక రకంగా శాశిస్తూనే ఉంటారు..ఎదొ ఒక ఉద్యొగం వచ్చాక..మన కార్యాలయాల్లొ ఎలా ఉన్న..ఇంట్లో కాస్త పరిస్తితి మెరుగు పడుతుందిమళ్ళి వెంటనే పెళ్ళి అంటారు
జీవితం మొత్తం శాసించే ఒక వ్యక్తిని పని గట్టుకుని ఆహ్వానించాలా?

ఏ కాటికి..అమ్మాయి అత్తగారింటికి వస్తుంది..పాపం ఎలా ఉంటుందో ఎమిటో..అబ్బాయి సరిగ్గ చుసుకుంటాదో లేదో అనే కాని..అబ్బాయి మంచి వాడే..ఈ అమ్మయి అతన్ని అర్థం చేసుకుంటుందో లెదో..అత్తగారిని బాగా చూసుకుంతుందో లెదో అని ఓక్కరూ ఆలొచించరు….పైగా అత్తగారేదో కొడలి మీద పెత్తనం చెలాయిస్తొందంటూ పుకార్లు పుట్టిస్తారు

ఎవండొఇ..నాకు ఇంకా పెళ్ళి కాలేదు..నాకేమిటి మా అన్నయ్యకే కాలెదు..ఎదొ ఊసుపొక ఇలా ఉన్న అక్కసంతా కక్కెసా…. ఈంక చాలు లెండి..ఉంటా

ఇంతకీ నేను చెప్పదలుచుకుందెంతంటే ---- వివాహం విద్య నాశాయఆ తర్వాత నేను చెప్పను..

Monday, April 9, 2007

ఆలోచనలు

నేను చాలా రోజులు నుంచి ఆలోచిస్తున్నా…ఎమి ఆలోచించాలా అని ఆలోచిస్తున్నా..

ఆలోచనల మూలం ఎమిటా అని ఆలోచిస్తున్నా…అసలు ఆలోచనలు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తున్నా..ఇంతకి మూలం దొరికిందా అంటే….దొరికిందనే చెప్పాలి….

సృష్తి స్థితి లయ కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ ఆలోచనలకన్నిటికి మూలము
అందుకే అన్నమాచార్యుల వారు అంటారు…

చిత్తములొ భావమెల్ల శ్రీ వేంకటేశుడే
తక్కిన ప్రకృతి యల్ల ఆతని మాయే
మిక్కిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు
ఇట్టి దేహపు బ్రతుకు బ్రతికేటి వారికి ...

ఎంత చక్కగా చెప్పారండి....మన ఆలోచనల భావం ఆ శ్రీ వెంకటేశుడెనట....ఇక మిగిలిన ఈ భూప్రపంచం లొని ప్రానులంతా ఆతను కల్పించిన మాయె....

ఈ ఒక్క ఫాట చాలాదా...ఇంకో కీర్తనలో,

భావములొన బాహ్యము నందున..
గొవింద గొవింద అని కొలువవో మనస....

మనం మన భావములొను..అంటే ధ్యాన ప్రపంచం లోనూ అలానే ఈ బాహ్య ప్రపంచం లోనూ…ఆ గొవింద నామమే జపిస్తూ ఉందలి…. అలా జపించినప్పుడే మనకి
పైన చెప్పినట్టుగా...ఆ ఆలొచనల భావం ఆ శ్రీవేంకటేసుడే అని అర్థం అవుతుంది,,,
ఇదెమిట్రా వీడు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు అనుకున్నరా...ఏదో అన్నమాచార్య కీర్తనల మీద మక్కువ తొ ఇలా ఉదహరణ సహితంగా రాద్దామని అనిపించింది(ఇక్కడెమి ఉదహరణ ఇవ్వలేదు..వెతకకండీ)...

ఇట్లు భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్