Monday, April 9, 2007

ఆలోచనలు

నేను చాలా రోజులు నుంచి ఆలోచిస్తున్నా…ఎమి ఆలోచించాలా అని ఆలోచిస్తున్నా..

ఆలోచనల మూలం ఎమిటా అని ఆలోచిస్తున్నా…అసలు ఆలోచనలు ఎందుకు వస్తాయి అని ఆలోచిస్తున్నా..ఇంతకి మూలం దొరికిందా అంటే….దొరికిందనే చెప్పాలి….

సృష్తి స్థితి లయ కారకుడైన ఆ శ్రీ మహావిష్ణువే ఈ ఆలోచనలకన్నిటికి మూలము
అందుకే అన్నమాచార్యుల వారు అంటారు…

చిత్తములొ భావమెల్ల శ్రీ వేంకటేశుడే
తక్కిన ప్రకృతి యల్ల ఆతని మాయే
మిక్కిలి ఈతని కంటే మరి లేవు ఇతరములు
ఇట్టి దేహపు బ్రతుకు బ్రతికేటి వారికి ...

ఎంత చక్కగా చెప్పారండి....మన ఆలోచనల భావం ఆ శ్రీ వెంకటేశుడెనట....ఇక మిగిలిన ఈ భూప్రపంచం లొని ప్రానులంతా ఆతను కల్పించిన మాయె....

ఈ ఒక్క ఫాట చాలాదా...ఇంకో కీర్తనలో,

భావములొన బాహ్యము నందున..
గొవింద గొవింద అని కొలువవో మనస....

మనం మన భావములొను..అంటే ధ్యాన ప్రపంచం లోనూ అలానే ఈ బాహ్య ప్రపంచం లోనూ…ఆ గొవింద నామమే జపిస్తూ ఉందలి…. అలా జపించినప్పుడే మనకి
పైన చెప్పినట్టుగా...ఆ ఆలొచనల భావం ఆ శ్రీవేంకటేసుడే అని అర్థం అవుతుంది,,,
ఇదెమిట్రా వీడు పెద్ద ఉపన్యాసం ఇచ్చాడు అనుకున్నరా...ఏదో అన్నమాచార్య కీర్తనల మీద మక్కువ తొ ఇలా ఉదహరణ సహితంగా రాద్దామని అనిపించింది(ఇక్కడెమి ఉదహరణ ఇవ్వలేదు..వెతకకండీ)...

ఇట్లు భవదీయుడు
వంశీ కృష్ణ కార్తీక్

No comments:

Post a Comment